Superintendents and Managers as Administrative Officers
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.20, ఇ.ఎఫ్.ఎస్.&టి. డిపార్ట్‌మెంట్ .తేదీ 29-03-2023, అటవీ శాఖ .లో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌లు మరియు మేనేజర్‌లను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా గుర్తిస్తూ గెజిటెడ్ హోదాను కలుగజేసింది.
అటవీశాఖ ఉద్యోగులలో నూతన ఉత్సాహం - చాలా సంవత్సరాలు గా వారు ఈ విషయం పై పలు మార్లు అభ్యర్ధనలు పంపింపించి నప్పటికి అనేక మార్లు ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం త్రిప్పి పంపించడం జరిగింది. కానీ, వారు ఆ విషయంలో పట్టుదలగా ప్రయత్నించి ఎట్టకేలకు విజయం సాధించి నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అసోసియేషన్ కి చేసిన సేవలకు తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు.
ముఖ్యంగా ఈ విషయంలో గొప్ప మద్దతు మరియు ఆశీర్వాదంతో డిపార్ట్‌మెంట్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ / గెజిటెడ్ ఆఫీసర్‌గా సత్కరించినందుకు, వారు సఫలీ కృతులు అయ్యేందుకు అన్నివిధాలా సహకరించిన అటవీశాఖ గౌరవనీయ ముఖ్య ప్రధాన సంరక్షణాధికారి మరియు దళాధిపతి శ్రీ వై.మధుసూధన రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. వారికి హృదయపూర్వకంగాధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ టి.రామచంద్ర రావు గారు, రాష్ట్ర సెక్రెటరీ శ్రీ మోహమ్మద్ అహేసాన్ గారు అందరు సూపరింటెండెంట్లు మరియు మేనేజర్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ... ఈ గొప్ప విజయానికి ఎప్పటికప్పుడు వివిధ అంశాలలో వారి విలువైన సమయం, సేవలు, సూచనలు మొదలైనవాటిని అందించి సాకారం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపెరునా ధన్యవాదాలు తెలియజేశారు.
Comments