పి.ఆర్.సి. కమిషనర్ కి ప్రతిపాదనల సమర్పణ
- APFSA
- Sep 20, 2018
- 1 min read

మన అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల అందరి ఆలోచనలను, సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర రావు, జనరల్ సెక్రెటరీ అహెసాన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మాధవ రెడ్డి, మరికొందరి సభ్యులు కలసి వేతన సవరణ కొరకు మనం ప్రతిపాదించిన అంశాల తాలూకు నివేదికను తయారుచేసి ప్రెసిడెంట్ శ్రీ టి. రామచంద్ర రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ మరియు కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ కొండా నాయక్ లు ఈ రోజు అనగా ది.20-09-2018 ఆంధ్ర ప్రదేశ్ వేతన సవరణ సంఘ కమీషనర్ గారిని కలసి సమర్పించుట జరిగినది. మనము ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు, సాధించడానికి ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయి అని, ఇది ఆ దిశగా సమైక్యంగా మనం వేసిన మొదటి అడుగు మాత్రమే నని, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర రావు అన్నారు. మనం మన కుటుంబ సభ్యులకోసం, కార్యాలయాల్లో పనిచేస్తాం. అలాగే మన బాస్ కోసం కూడా అది మన జీవన విధానం. అలాగే ప్రతి రోజు కొంత సమయం అసోసియేషన్ కొరకు కూడా పనిచేయగలిగితే మన అసోసియేషన్ కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
Recent Posts
See AllAPPSC ACF (Assistant Conservator of Forests) Recruitment 2022 – apply for the latest vacancy at Psc.ap.gov.in before the last date....
Comments