top of page

APFSA సర్వ సభ్య సమావేశం



APFSA

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం ఈ (09-09-2018) రోజు ఉదయం గుంటూరు లోని రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి 150 మంది అటవీశాఖ జూనియర్ అసిస్టెంట్ నుండి మేనేజర్ స్థాయి మినిస్టేరియల్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సమావేశం సీనియర్ కామ్రేడ్ శ్రీ టి.రామచంద్ర రావు, సూపరింటెండెంట్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం ముఖ్యోద్దేశం అటవీ శాఖలోని మినిస్టేరియల్ సిబ్బంది అందరియొక్క ఐక్యతను చాటడమేనని తెలియజేశారు. రాష్ట్ర కార్యవర్గ౦ ఎన్నిక కోసం అన్నీ జిల్లాలనుండి వచ్చిన కామ్రేడ్స్ తో మాట్లాడటం జరిగిందని, ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ౦ ఏకగ్రీవంగా ఎంపిక చేసి తీర్మానం చేయాలని అనుకుంటున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో సీనియర్ కామ్రేడ్ శ్రీ టి.విజయ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఒక పిలుపు ఇవ్వగానే స్పందించి విచ్చేసిన అసోసియేషన్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాధించాల్సి౦ది చాలా ఉందని ఈ రోజు ఎన్నుకోబోయే రాష్ట్ర కార్యవర్గ౦ ఈ విషయాలపై సత్వరచర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నని తెలియజేశారు. శ్రీ రాజకుమార్, ట్రెజరర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు మన అసోసియేషన్ ఐక్యత కొరకు సోషల్ మీడియా ద్వారా మరియు అసోసియేషన్ సభ్యుల కొరకు వెబ్సైట్ ద్వారా విజ్ఞాన్ని పెంపొందించడానికి చాలా చర్యలు చేపట్టామని వాటిని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నామని తెలియజేశారు. కొత్తగా ఎన్నుకున్న జిల్లా కార్యవర్గ సభ్యులు ఎప్పటికప్పుడు తమ తమ జిల్లాలలో సమావేశాలు జరుపుకుంటు ఆయా జిల్లాల సభ్యుల యొక్క ఇబ్బందులను తెలుసుకుని జిల్లాల స్తాయిలో పరిష్కారం దొరకక పోతే రాష్ట్ర కార్యవర్గ౦ దృష్టికి తేవాలని అన్నారు. మరో సీనియర్ కామ్రేడ్ శ్రీ ఆర్. మాధవ రెడ్డి, సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ ఈ అసోసియేషన్ రికగ్నిషన్ రాబోయే 6 మాసాలలో సాధించాలనే ప్రయత్నం లో ఉన్నామని చెప్పారు. అంతే కాక మినిస్టేరియల్ సిబ్బంది కి కనీసం 3 మాసాల శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కృషిచేయాల్సి ఉందని తెలిజేశారు. సీనియర్ కామ్రేడ్ శ్రీ సి.ఎండి.ఎహేసాన్, సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ PRC కమీషన్ కు నివేదక 20 వ తేదీ లోపు సమర్పించవలసి ఉందని తెలియజేసారు. ఈ రోజు ఎన్నుకోబోయే రాష్ట్ర కార్యవర్గ౦ లో సభ్యులను మనం అందరం ఏకాభిప్రాయ౦ తో ఎన్నుకొని మన ఐక్యతను చాటుకుందామని చెప్పారు. సీనియర్ కామ్రేడ్ శ్రీ టి.విజయ కుమార్ రాష్ట్ర కార్యవర్గ౦ లో సభ్యుల పేర్లను చదివి వినిపించి సభ్యుల ఆమోదం కోరారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని చప్పట్లతో తెలియజేశారు. ప్రకటించిన సభ్యుల వివరాలు ఈ దిగువన కలవు.

President : Sri T. Rama Chandra Rao

General Secretary : Sri C. Md. Ahesan

Treasurer : Sri K. V. S. Raj Kumar

Associate President : Sri R. Madhav Reddy

Vice-President : Sri P. V. Satyanarayana

Vice-President : Sri T. Vijaya Kumar

Vice-President : Sri S. Uma Maheswara Rao

Vice-President : Sri Md. Arif

Vice-President : Sri K. V. Lokanath Babu

Vice-President : Sri V. Satyanarayana Rao

Joint Secretary : Sri M. J. V. S. R. Varma

Joint Secretary : Sri C. Nagendra Vara Kumar

Joint Secretary : Sri P. Srinivas

Joint Secretary : Sri N. V. Ramana

Organising Secretary : Sri B. V. Krishna Rao

Organising Secretary : Sri T. Ganesh

Organising Secretary : Sri C. Anand

Publicity Secretary : Sri Ravi Chandra Babu

Publicity Secretary : Sri Ch. Nanchara Babu

Women wing Co-ordinator : Smt. D. V. Padmavathi

ఈ సమావేశం లో వివిధ కేటగిరీ లకు సంబంధించిన ఉద్యోగులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ఎంతో ఉత్సాహంగా హాజరై వారి సంఘీ భావాన్ని ప్రకటించారు. సభ్యుల సమన్వయంతో ఎంతటి కష్టతరమైన సమస్యలను కుడా సులభంగా పరిష్కరించుకోనుటకు అందరు ఏకతాటిపై కృషి చేయాలని తీసుకున్న నిర్ణయానికి సంఘ సభ్యులు అందరు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. సంఘం బలోపేతం చేసుకోడానికి ప్రతి సభ్యుడు చిత్తశుద్దితో పని చేసి తమ తోటి ఉద్యోగులకు సహాయ పడడం ద్వారా రాష్ట్రం లోనే నెంబర్ వన్ సంఘంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సంఘ సభ్యుల సమస్యలను అర్ధం చేసుకొని, పరిష్కరించే సత్తాగల నాయకులు మన సంఘం లో ఉన్నందున, అపరిష్కృతం గా ఉన్న డిమాండ్లు పరిష్కార నిమిత్తం ప్రభుత్వం వద్దకు తీసుకు వెళ్లి పరిష్కరించె దిశగా దశలవారిగా కార్యక్రమాలకు రూప కల్పన చేయవలసిన బాధ్యత ప్రస్తుత నూతన కార్యవర్గం పై ఉన్నదని కొందరు సభ్యులు తెలిపారు.

Comentarios


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page