ఉద్యోగుల డీఏ పై ఏపీ కేబినెట్ నిర్ణయం.
ఉద్యోగులకు బకాయిఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ 5.24శాతంగా రాష్ర్ట మంత్రి మండలి ఈ రోజూ జరిగిన మంత్రివర్గ సమావేశం లో ఆమోదించింది. మంత్రి మండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు చెప్పారు. 3.144 శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో 2, 3 డీఏలు చెల్లిస్తామన్నారు. కరోనా సమయంలో ఆపిన మార్చి నెల వేతనాలను డిసెంబర్‌లో, ఏప్రిల్ నెలలో పెండింగ్ బకాయిలను జనవరిలో అందిస్తామన్నారు.
తొలి డీఏ అరియర్స్30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 2018 జులై నుంచి ఇవ్వాల్సిన డీఏ అరియర్స 2021 జనవరి నుంచి జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో చెల్లిస్తామని కన్నబాబు చెప్పారు. .
పెన్షనర్లు, ఉద్యోగుల డీఏల చెల్లింపులు ఈ క్రింది విధంగా ఉంటాయి.
పెన్షనర్లకు 3.144 శాతం పెంపు, జులై 2018 నుంచి వర్తింపు, జనవరి –2021 నుంచి చెల్లింపు
జనవరి, 2019 నుంచి మరో 3.144శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జులై నుంచి చెల్లింపు
జులై 2019 నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జవరి 2022 నుంచి చెల్లింపు
ఉద్యోగులకు జులై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు
జనవరి, 2019 నుంచి 3.144శాతం పెంచిన డీఏను జులై 2021 నుంచి చెల్లింపు
జులై 2019 నుంచి పెంచిన 5.24శాతం డీఏను జనవరి 2022 నుంచి చెల్లింపు.
Commentaires