సమస్యల పరిష్కారదిశగా ప్రయాణం ప్రారంభ౦
- APFSA
- Sep 10, 2018
- 1 min read
ది.10-09-2018 ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామ్రేడ్ శ్రీ టి.రామచంద్ర రావు మరియు జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ శ్రీ సి.ఎండి.ఎహేసాన్ గార్ల అధ్యక్షతన క్రొత్తగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ౦ డా: మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, భారత అటవీ సేవాధికారి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి), ఆంధ్రప్రదేశ్, గుంటూరు వారిని మర్యాద పూర్వకంగా కలిసి వారికి (13) జిల్లాలు మరియు ప్రధాన కార్యలయం శాఖల లో ఎన్నిక కాబడిన కార్యవర్గాల మరియు రాష్ట్ర కార్యవర్గ౦ యొక్క వివరాలను అందజేశారు. అసోసియేషన్ సభ్యుల సమస్యలను విన్నవించడానికి, వాటి పరిష్కారాల నిమిత్తం ఒక సమావేశమును ఏర్పాటు చేయవలసినదిగా కోరుతూ అటవీ దళాధిపతి గారిని అతి త్వరలో వారికి అనుకూలమైన ఒక తేదీని తెలుప వలసినదిగా కోరుట జరిగింది. ఈ విషయము పై అనుకూలముగా స్పందించిన ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) త్వరలో సమావేశాన్ని నిర్వహించటానికి తేదీ ఇస్తానని వాగ్దానం చేశారు. తదుపరి, శ్రీ వి.బి.వి.రమణ మూర్తి, భారత అటవీ సేవాధికారి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అడ్మిన్)గారిని, శ్రీ ఏ.కె.జా, భారత అటవీ సేవాధికారి, అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (హెచ్‌ఆర్‌డి) గారిని, శ్రీ నరసింహా చారి, సహాయ అటవీ సంరక్షణాధికారి (హెచ్‌ఆర్‌డి) గారిని కలిసి వారికి కొత్తగా ఎన్నికైన కార్యవర్గం యొక్క వివరాలను తెలియజెసి సభ్యుల యొక్క అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరిత గతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవలసినదిగా కొరడమైనది. దానికి వారు అనుకూలముగా స్పందించడం జరిగింది.
- సి.ఎండి.ఎహేసాన్, జనరల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి
Recent Posts
See AllAPPSC ACF (Assistant Conservator of Forests) Recruitment 2022 – apply for the latest vacancy at Psc.ap.gov.in before the last date....
Comments