ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 25 నుండి డిసెంబర్ 01 తేదీ వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. 2000 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి అకాడెమీ, విజయవాడ అధికారులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసింది గా నిరుద్యోగులను కోరుతున్నారు.